ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారుః “ప్రాథమికంగా షరియహ్ ఙ్ఞానమును నేర్చుకొనుట అనేది కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందుట కొరకు ఉద్దేశించబడినది; కానీ ఎవరైతే షరియహ్ ఙ్ఞానమును ప్రాపంచిక ప్రయోజనాలు, లాభాలు పొందుట కొరకు, ధనము లేదా హోదా పొందుట కొరకు నేర్చుకున్నట్లయితే అలాంటి వాడు తీర్పు దినమున స్వర్గం యొక్క వాసనను కూడా చూడడు.”