అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు." అపుడు సహచరులు ఇలా అడిగారు: "ఎవరు, ఓ రసూలల్లాహ్?" దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "ఎవరి చెడు వలన అతడి పొరుగువారు సురక్షితంగా ఉండలేరో." ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా మూడుసార్లు ప్రమాణం చేసి మరీ, తను చెప్పబోతున్న విషయంలోని గంభీరతను ధృవీకరించారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు," దానికి సహచరులు ఆయనను ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! ఎవరు విశ్వాసి కాడు?" అపుడ ఆయన ఇలా జవాబు ఇచ్చారు: "పొరుగువాడు ఎవరి ద్రోహం, అన్యాయం మరియు చెడుకు భయపడతాడో, అతడు (ముమిన్ అంటే విశ్వాసి కాజాలడు)."

explain-icon

Benefits from the Hadith

  • అతడి పొరుగువాడు, అతడి దౌర్జన్యం, అన్యాయం లేదా చెడు నుండి భయపడుతున్నట్లయితే, అలాంటి వ్యక్తిలో విశ్వాసం లేదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం వలన అలా చేయడం అతి పెద్ద పాపం (కబీరా పాపం) అని, అలాంటి వ్యక్తిలో విశ్వాసం లోపిస్తుందని సూచిస్తుంది.
  • పొరుగువారి పట్ల దయ చూపడం మరియు తన మాటల ద్వారా లేదా చేతల ద్వారా అతనికి హాని కలిగించకుండా ఉండడం దృఢంగా ప్రోత్సహించబడింది.