ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కొంతమంది సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) సహరీ భోజనం చేసినారు, అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు కొరకు లేచినారు. జైద్ బిన్ థాబిత్ (రదియల్లాహు అన్హు)ను, అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అడిగినారు: 'అదాన్ కు మరియు సహరీ భోజనం పూర్తి చేసిన దానికి మధ్య ఎంత సమయం ఉండింది? దానికి జైద్ బిన్ థాబిత్ (రదియల్లాహు అన్హు) ఇలా జవాబిచ్చారు: 'సగటు పరిమాణంలో ఉన్న యాభై ఆయతులు (ఖుర్ఆన్ వచనాలు) చదివేంత సమయం - అది చాలా దీర్ఘమైనవి లేదా చాలా చిన్నవి కాదు. అలాగే చాలా వేగంగా లేదా మరీ నిదానంగా పఠించడానికి పట్టే సమయము కాదు.