ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియఏస్తున్నారు: ‘షరియత్’లో నిర్దిష్టమైన శిక్షలు నిర్ణయించబడిన పాపములలో (ఉదా: దొంగతనము, వ్యభిచారము మొ.) ఎవరైనా ఏదైనా పాపము చేసి ఉండి, ఆ పాపానికి అతడు ఈ లోకములో శిక్షించబడితే, ఆ శిక్ష అతని ఆ పాపాన్ని తొలగిస్తుంది; మరియు ఆ పాపానికి పరలోకములో శిక్షనుండి విముక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే ఒకే పాపానికి రెండు శిక్షలు విధించడు; మరియు అల్లాహ్ ఈ లోకములో ఎవరి పాపాన్నైనా కప్పివేసి ఉండి, అతడిని మన్నించి, క్షమించి ఉన్నట్లైతే, మరియు అతడు ఆ పాపానికి ఈ లోకములో శిక్షించబడకపోయినట్లైతే, అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే తాను అప్పటికే మన్నించి, క్షమించివేసిన పానికి పరలోకములో తిరిగి శిక్ష విధించడు.