ఉమ్ అతియా అల్-అన్సారియహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం స్త్రీలు జనాజా తీసుకు వెళుతున్న జమఆతును అనుసరించడాన్ని నిషేధించారు; కారణం మృత్యువు కారణంగా తమ వారిలోని ఒకరు దూరమై పోవడం అనే విషయాన్ని తేలికగా జీర్ణించు కోలేని వారి సున్నితత్వం, వారి పరిమితమైన ఓర్పు మొదలైనవి. ఆమె ఇంకా ఇలా అన్నారు: అయితే ఇతర నిషేధిత విషయాలలో కఠినంగా నొక్కి చెప్పినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలోని నిషేధాన్ని నొక్కి చెప్పలేదు.