అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీరు పరస్పరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోండి, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
హసన్ హదీథు - అల్ బుఖారీ 'అదబుల్ ముఫ్రద్'లో, అబూ యాలా మరియు బైహఖీ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముస్లింలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలని ప్రోత్సహించారు. మరియు బహుమతులు ప్రేమను పెంచే మరియు హృదయాలను కలిపే కారణాలలో ఒకటి (అని తెలియజేశారు).
Benefits from the Hadith
బహుమతి నివ్వడం అభిలషణీయము, అభినందనీయము. ఎందుకంటే దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించారు.
బహుమతి అనేది ప్రేమకు ఒక కారణం.
ఒక వ్యక్తి తనకు మరియు ప్రజలకు మధ్య ప్రేమానురాగాలను పెంపొందించేందుకు, తనకు సాధ్యమైనంతలో వారికి బహుమతి ఇవ్వడం, వారితో మృదువుగా వ్యవహరించడం మరియు మంచి మాటలు మాట్లాడటం లేదా చిరునవ్వుతో వారిని పలకరించడం వంటివి చేయాలి.