ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అంటున్నారు – ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదులు కానీ, క్రైస్తవులు కానీ లేక వేరే ఇంకెవరైనా కానీ వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశము చేరిన తరువాత దానిని విని కూడా, ఆ సందేశాన్ని విశ్వసించకుండా (ఇస్లాం ను స్వీకరించకుండా) చనిపోతే, నిశ్చయంగా అటువంటి వాడు నరకవాసులలో ఒకడు అవుతాడు. నరకం లో అతడు శాశ్వతంగా పడిఉంటాడు.