ఆయిషా రజియల్లాహు అన్హా – విశ్వాసుల మాతృమూర్తి – ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్మరించుటలో ఎక్కువ చురుకుగా, ఉత్సాహంగా, ఆసక్తి కలిగి ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా, అన్ని స్థితులలో మరియు ఏ ప్రదేశములో నైనా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండేవారు.