ప్రవక్త ముహమ్మద్ ﷺ మనం దుఆ (ప్రార్థన) చేసేటప్పుడు చేతులు పైకి ఎత్తాలని ప్రోత్సహించారు. పరమ పవిత్రుడైన అల్లాహ్ చాలా సిగ్గు గలవాడు అంటే బిడియపడేవాడు (హయీ), ఆయన తన దాసులకు ప్రసాదించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు, దాసుడికి ఆనందం కలిగించే దానిని అతడికి ప్రసాదిస్తాడు, అతడి కొరకు హానికరమైన దానిని అతడికి దూరంగా ఉంచుతాడు. అల్లాహ్ చాలా దయగలవాడు (కరీమ్), ఆయన అడగకపోయినా ఇస్తాడు, అయితే అడిగినప్పుడు మరింత అధికంగా ఇస్తాడు! అల్లాహ్ తనను విశ్వసించే దాసుడు దుఆ కోసం చేతులు పైకి ఎత్తినప్పుడు, ఆ చేతులను ఖాళీగా, నిరాశతో వాపసు చేయడాన్ని సిగ్గుగా భావిస్తాడు.