ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుని ఉన్న తన సహాబాలలో కొందరి వద్ద నిలబడి వారిని ఇలా అడిగారు: మీలో ఉత్తములు ఎవరో మరియు అధములు ఎవరో నేను మీకు తెలియజేయనా? తమలో ఎవరు ఉత్తములో, ఎవరు అధములో తేలిపోతుందనే భయంతో మరియు అవమానం పాలవుతామేమో అనే భీతితో వారు ఏమీ మాట్లాడకుండా, జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి ముందు ఆ ప్రశ్నను మూడు సార్లు పునరావృతం చేయగా, వారిలో నుండి ఒక వ్యక్తి ఇలా సమాధానమిచ్చాడు: తప్పకుండా ఓ రసూలుల్లాహ్! సల్లల్లాహు అలైహి వసల్లం, మాలో మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో మాకు తెలియజేయండి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఈ విధంగా వివరించారు: “మీలో ఉత్తములు ఎవరంటే – ఎవరి నుండి అయితే మేలు, దయ మరియు సత్కార్యాలు ఆశించబడతాయో, ఎవరి కీడు నుండైతే భద్రత ఉంటుందో, మరియు అతని దౌర్జన్యం, కీడు మరియు అన్యాయం నుండి ప్రజలు భయపడకుండా ఉంటారో. మరియు మీలో అధములు ఎవరంటే – ఎవరి నుండి అయితే ఎటువంటి మేలు, దయ మరియు సత్కార్యాలు ఆశించబడవో, ఎవరి కీడు నుండైతే భద్రత ఉండదో, బదులుగా అతని దౌర్జన్యం, కీడు మరియు అన్యాయం నుండి ప్రజలు భయపడతారో”.