అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)" ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను ఇలా హెచ్చరించారు — ఒకరు ధరించే క్రింది దుస్తులు అంటే ప్యాంటు, లుంగీ లేదా క్రింది దేహాన్ని కప్పే ఇతర వస్త్రాలు, వారి కాలిచీలమండలము కంటే దిగువగా వేలాడకూడదు. ఎవరైనా తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకుంటే, ఆ భాగం నరకాగ్నిలో పడుతుంది. ఇది అతడు చేసిన పనికి శిక్ష.

explain-icon

fawaed

  • పురుషులు తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకోవడం ఇస్లాంలో నిషిద్ధం, ఇది పెద్ద పాపాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
  • ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా తన ఇజార్ (క్రింది దుస్తులు)ను సముచితమైన కారణాల వలన మాత్రమే కాలి చీలమండలము కంటే దిగువగా వేసుకోవడం అనుమతించబడుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా కాలిచీల మండలము వద్ద లేదా దాని క్రింద గాయముంటే, ఆ గాయాన్ని దోమలు లేదా ఈగలు బాధించకుండా కప్పుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అతనికి మరో ప్రత్యామ్నాయం లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.
  • ఈ నియమం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే మహిళలు తమ దుస్తులను కాలిమడమలకు దిగువగా, ముంజేయి పొడువంత వరకు పొడిగించమని ఆజ్ఞాపించబడింది.
explain-icon

కూర్పులు

explain-icon

ఇంకా