ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ యొక్క సంరక్షకుడిని మరియు ఆమె బాధ్యత వహించే వారిని, స్త్రీలను మస్జిదులకు వెళ్ళకుండా నిరోధించడాన్ని నిషేధించారు మరియు స్త్రీలు బయటకు వెళ్ళేటప్పుడు, వారు పురుషుల ఆకర్షణకు మరియు పాపానికి పాల్బడే కారణంగా మారకుండా ఉండేందుకు, సువాసనలు పూసుకోకుండా మరియు అలంకరణలు చేసుకోకుండా వెళ్ళాలని ఆదేశించారు.