రమదాన్ చివరి పది రోజులు ప్రారంభమైనప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రంతా అనేక విధాలుగా అల్లాహ్‌కు విధేయత చూపుతూ గడిపేవారు. ఆయన తన కుటుంబాన్ని కూడా లేపి నమాజు చేయించేవారు. సాధారణంగా చేసే ఆరాధనల కంటే మరింతగా ఎక్కువగా శ్రమించేవారు. తాను పూర్తిగా ఆరాధనలలో నిమగ్నమై, తన భార్యలతో సన్నిహిత సంబంధాన్ని కూడా నివారించేవారు.