విశ్వాసుల మాత హఫ్సా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఖుర్ఆన్ పారాయణం ఎలా ఉండేది?" దానికి ఆమె "మీరు ఆయనలా పఠించలేరు" అని చెప్పగా, మరలా వారు ఆమెతో, "మాకు తెలియజేయండి" అని అన్నారు. నాఫె తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ పారాయణ పద్ధతిని అనుకరించి, వారికి స్పష్టంగా తెలియజేయడానికి ఇబ్నె అబీ ములైక మా కొరకు నెమ్మదిగా పారాయణం చేశారు. ఆయన ఇలా పఠించారు: {అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్} తర్వాత పారాయణాన్ని ఆపారు, {అర్రహ్మానిర్రహీమ్}, తర్వాత పారాయణాన్ని ఆపారు, {మాలికి యౌమిద్దీన్}.