ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: తనపై ఎవరు సలాం పంపినా – వారు దగ్గరగా ఉన్నా, లేక దూరంగా ఉన్నా- వారికి తిరిగి సలాం పంపుటకుగానూ, తన ఆత్మ తిరిగి పంపబడుతుంది. “బర్జఖ్” (అంటే మరణం మరియు పునరుథ్థాన దినము మధ్య కాలం); మరియు సమాధిలో జీవితం అనేది అగోచర విషయం (కనిపించనది). వాటి వాస్తవికత సర్వోన్నతుడు, అన్నింటిపై అధికారం కలవాడు అయిన అల్లాహ్’కు తప్ప మరెవరికీ తెలియదు.