అబూ హమ్'జహ్ అనస్ ఇబ్నె మా లిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడు - ఆయన ఇలా అన్నారు: “మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.” ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు – ఒక ముస్లిం, తాను తన స్వయం కొరకు దేనినైతే (ఏఏ విషయాలనైతే) ఇష్టపడతాడో, దానినే (ఆ విషయాలనే) తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడనంతవరకు – తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. అంటే ఉదాహరణకు: అల్లాహ్’కు విధేయత చూపే ఆచరణలలో, ధార్మిక జీవనానికి సంబంధించి మరియు ప్రాపంచిక జీవనానికి సంబంధించి వివిధ రకాల సత్కార్యాలు చేయుట – మొదలైన వాటిలో తన కొరకు ఏమైతే ఇష్టపడతాడో, తన సోదరుని కొరకు కూడా దానినే ఇష్టపడనంత వరకు; అలాగే తన స్వయం కొరకు దేనినైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, తన సోదరుని కొరకు కూడా దానిని ఇష్టపడనంత వరకు తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. ఒకవేళ అతడు తన సోదరునిలో – ధార్మిక విషయాలలో అంటే అల్లాహ్’కు విధేయత చూపుటలో ఏమైనా లోపాలు, కొరత గమనించినట్లయితే అతడు ఆ లోపాలను, కొరతను తొలగించడానికి పాటుపడతాడు; తన సోదరునిలో ఏమైనా మంచిని గమనించినట్లయితే అతడిని ప్రోత్సహిస్తాడు, మార్గదర్శకం చేస్తాడు; ధార్మిక జీవనానికి, ప్రాపంచిక జీవనానినికి సంబంధించిన విషయాలలో అతనికి మంచి సలహాలు ఇస్తాడు.

explain-icon

fawaed

  • ఒక ముస్లిం తన కొరకు దేనినైతే ఇష్ట పడతాడో, దానినే తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడుట విధి (వాజిబ్). అలా చేయకపోతే అతని విశ్వాసం నిరాకరించబడడం అనేది ఆ విషయాన్ని వాజిబ్ చేస్తున్నది.
  • ధర్మములో సహోదరత్వం (ఒక ముస్లిం మరొక ముస్లిమునకు ధార్మిక సహోదరుడు) అనేది, రక్తసంబంధ సహోదరత్వం కంటే కూడా పైస్థాయి కలిగి ఉన్నది. కనుక దాని హక్కు చెల్లించుట మరింతగా విధి (వాజిబ్) అవుతుంది.
  • ఈ ప్రేమకు విరుద్ధమైన అన్ని మాటలు మరియు చర్యలను నిషేధించడం, వాటికి దూరంగా ఉండడం ముఖ్యం; అంటే ఉదాహరణకు: మోసం చేయడం, దూషించడం, అసూయ మరియు వ్యక్తిగతంగా ఒక ముస్లింనకు, అతని సంపదకు లేదా అతని గౌరవానికి వ్యతిరేకంగా దాడి చేయడం వంటివి, వీటికి దూరంగా ఉండాలి.
  • తరుచూ “నా సోదరుని కొరకు” అనే లాంటి మాటలు ఉపయోగించడం, ఆ దిశలో ఆచరణను ప్రోత్సహిస్తుంది.
  • అల్ కిర్మానీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఒక ముస్లిం తన కొరకు కీడును ఏ విధంగానైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, అదే విధంగా తన సోదరుని కొరకు కూడా అయిష్ట పడుట విశ్వాసములోని భాగమే - అతడు దానిని వ్యక్తపరచకపోయినా సరే. ఎందుకంటే తన సోదరుని కొరకు ఒక విషయాన్ని ఇష్టపడుట అంటే, దానికి వ్యతిరేకమైన దానిని అసహ్యించుకొనుట కూడా కావాలి. కనుక ఆ అయిష్టమైన విషయాలను పూర్తిగా వదిలివేయుటతో అది సరిపోతుంది.
explain-icon

ఇంకా