ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం, స్త్రీలు మరణించిన వ్యక్తి కోసం, అది తండ్రి అయినా, సోదరుడు అయినా, కొడుకు అయినా లేదా మరెవరైనా అయినా సుగంధ ద్రవ్యాలు, కోహ్ల్, నగలు లేదా అందమైన దుస్తులు ధరించకుండా మూడు రోజుల కంటే ఎక్కువ కాలం దుఃఖించడాన్ని నిషేధించారు, కేవలం భర్త విషయం లో తప్ప; భర్త చనిపోయినట్లయితే సంతాప కాలం నాలుగు నెలల పది రోజులు. భర్త కోసం పాటిస్తున్న దుఃఖదినముల సమయంలో ఆమె అలంకరణ కోసం రంగు వేసిన లేదా అద్దిన దుస్తులను ధరించరాదు, 'అసబ్ (మాదిరి) వస్త్రం' తప్ప, అసబ్ వస్త్రం అనేది నేయడానికి ముందు రంగు వేయబడిన యెమెన్ వస్త్రం. ఆ దుఃఖ దినముల సమయములో అలంకరణ కోసం తన కళ్ళకు కొహ్’ల్ (కాటుక, సుర్మా లేదా అటువంటి పదార్థాలు) రాసుకోకూడదు, లేదా పరిమళ ద్రవ్యాలు లేదా ఇతర సువాసనలను ఉపయోగించకూడదు, ఆమె ఋతుస్రావానికి గురైతే తన శరీరాన్ని కడుక్కున్న తరువాత (గుస్ల్ చేసిన తరువాత) తప్ప. ఋతుస్రావం నుండి పరిశుద్ధత పొందిన తరువాత ఆమె ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ అనే ధూపపు ముక్కలను, సుగంధ ద్రవ్యంగా కాకుండా ఏదైనా అప్రియమైన వాసనను తొలగించే సాధనాలుగా ఉపయోగించవచ్చు. ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ అనేవి ప్రసిద్ధి చెందిన సుగంధ ధూపసామాగ్రికి చెందినవి. ఆమె వాటిని ఋతుస్రావపు రక్తంతో ప్రభావితమైన యోని ప్రాంతంపై సున్నితంగా పూయవచ్చు, సుగంధ ద్రవ్యాలను పూసుకున్నట్లు కాకుండా.