అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగ వేదిక (మెంబరు) పై ఉన్నప్పుడు దానధర్మాలను గురించి మరియు ప్రజలను బిచ్చమెత్తకుండా ఉండుటను గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: "పైచేయి క్రింది చేయి కంటే మంచిది; పైచేయి దానం చేసే చేయి, మరియు క్రింది చేయి యాచించే చేయి." ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చేస్తూ దానధర్మాలు చేయడాన్ని గురించి మరియు భిక్షాటన నుంచి దూరంగా ఉండటం గురించి ప్రస్తావించారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “అడుక్కునే కింది చేయి కంటే (అల్లాహ్ మార్గంలో) ఇచ్చే మరియు ఖర్చు చేసే పైచేయి అల్లాహ్’కు ఎంతో ఇష్టమైనది మరియు ప్రియమైనది.”

explain-icon

fawaed

  • ఈ హదీథు దానధర్మాలు చేయడాన్ని మరియు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయడం యొక్క గుణాన్ని మరియు భిక్షాటనను ఖండించడాన్ని నొక్కి వక్కాణిస్తున్నది.
  • ఇది యాచించడం మానేయడాన్ని మరియు ప్రజలపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఉత్తమ ఆచరణలను ప్రోత్సహిస్తుంది మరియు నీచమైన వాటిని విడిచిపెట్టమని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే అల్లాహ్ ఉత్తమ ఆచరణలనే ప్రేమిస్తాడు.
  • నాలుగు రకాల చేతులు ఉన్నాయి, ఘనతల పరంగా అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: దానం చేసే చేయి అత్యున్నతమైనది, దాని తరువాత దానాన్ని తీసుకోకుండా ఉండే చేయి, దాని తరువాత అడగకుండా వచ్చిన దానిని స్వీకరించే చేయి, మరియు దాని తరువాత యాచించే చేయి.
explain-icon

ఇంకా