ఖైస్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించే నిమిత్తము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు “రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” ఆదేశించినారు. కారణం రేగు ఆకులు పరిశుభ్రత పొందుట కొరకు ఉపయోగించేవారు, అలాగే వాటికి మంచి సువాసన కూడా ఉంటుంది.