దినములో మూడు సమయాలలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ఆచరించడాన్ని, చనిపోయిన వారిని ఖననం చేయడాన్ని నిషేధించినారు. మొదటి సమయం: సూర్యుడు ఉదయిస్తూ ఉన్నపుడు, అంటే సూర్యుడు పూర్తిగా ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించనంత వరకు (నమాజు ఆచరించరాదు). ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించడానికి దాదాపు పావు గంట సమయం పడుతుంది. రెండవది: మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద ఉన్నపుడు. అపుడు ఒక వస్తువు యొక్క నీడ తూర్పు వైపునకు గానీ లేక పడమర వైపునకు గానీ ఉన్నట్లుగా కనిపించదు, సూర్యుడు నడినెత్తి మీద నుంచి కొద్దిగా వాలనంత వరకు. సూర్యుడు నడినెత్తి మీదనుండి వాలితే అపుడు నీడ పడమర వైపు నుండి కనబడుతుంది. అపుడు జుహ్ర్ నమాజు సమయం మొదలవుతుంది. సూర్యుడు నడి నెత్తి మీద నుండి వాలడాని కొద్ది సమయమే పడుతుంది, దాదాపు ఐదు నిమిశాలు. మూడవది: సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తి కానంత వరకు.