అబీ బక్రత రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నారని ఉల్లేఖించారు: [తమ వ్యవహారాల భాద్యతను ఒక స్త్రీకు అప్పచెప్పిన జాతి ఎన్నటికీ సాఫల్యం పొందజాలదు}
ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టపరిచినారు, ప్రజలు తమ వ్యవహారాలను – అది న్యాయాధిపత్యం, సార్వత్రిక అధికారం లేదా మంత్రిత్వ శాఖ అయినా సరే – ఒక స్త్రీకి అప్పగించినట్లయితే, వారు తాము కోరుకున్న దానిలో ఎన్నటికీ విజయం సాధించలేరు.
Benefits from the Hadith
స్త్రీలు పరిపాలన, ప్రజల మధ్య తీర్పు చెప్పడం, మరియు అలాంటి ఇతర సార్వజనిక సంరక్షణ పదవులను చేపట్టరాదు. అయితే, వక్ఫ్ సంరక్షణ, అనాథల సంరక్షణ, లేదా మదరసా నిర్వహణ వంటి వ్యక్తిగత వ్యవహారాలలో అభ్యంతరం లేదు.
స్త్రీ యొక్క బలహీనత స్పష్టం చేయబడింది, ఆమె పురుషుడితో పాటు సాధారణ అధికార పదవులలో పాలుపంచుకోదు మరియు అలాంటి పదవిని చేపట్టడం అనేది వైఫల్యానికి కారణం అవుతుంది.
అల్లాహ్ స్త్రీని సృష్టించి, ఆమె స్వభావాన్ని పురుషుని స్వభావానికి భిన్నంగా ఉంచాడు. అందువలన, ఆమె ప్రత్యేక స్వభావం రీత్యా స్త్రీలు చేయడానికి తగని కొన్ని పనులు ఉన్నాయి; అదేవిధంగా, పురుషుడు తన ప్రత్యేక స్వభావం రీత్యా చేయడానికి తగని కొన్ని పనులు ఉన్నాయి.
తిరస్కరించబడిన ఫలాహ్: షరియత్ పరిభాషలో ఫలాహ్ అంటే ఈ లోకంలో మరియు పరలోకంలో శుభాన్ని సంపాదించడం. ఒక రాజ్యం యొక్క సౌభాగ్యం, ఆ ప్రజలు అల్లాహ్ ప్రసన్నతలో ఉన్నారని సూచించదు. ఎవరైతే అల్లాహ్ విధేయతలో ఉండరో, వారు విజయ సాధకులలో ఉండరు, వారి ప్రాపంచిక వ్యవహారాలు పైకి ఎంత ఉత్తమ స్థితిలో కనిపించినప్పటికీ.
ఈ హదీథులో మహిళలను కించపరచడం లేదు, అయితే ఇది ఆమె సామర్థ్యాలకు సరైన మరియు సముచితమైన మార్గదర్శకం.