ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: 'ఇంకా తన మరణ సమయం సమీపించని, అనారోగ్యంతో పడి వున్న ముస్లింను ఎవరైనా ఒక ముస్లిం సందర్శించి, ఈ దుఆను ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోసం ఏడుసార్లు రిపీట్ చేస్తే, అల్లాహ్ ఆ వ్యక్తిని ఆ అనారోగ్యం నుండి తప్పక స్వస్థపరుస్తాడు."' దుఆ: "నిన్ను స్వస్థపరచాలని నేను అల్లాహుల్ అజీమ్‌ను వేడుకుంటున్నాను - ఆయన స్వరూపంలో, షిఫాతులలో, కార్యాలలో గొప్పవాడు, గొప్ప సింహాసనానికి ప్రభువు."