ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడిని లేదా స్త్రీని మలద్వారము ద్వారా సంభోగించే వ్యక్తికి కలిగే తీవ్రమైన పరిణామాలను స్పష్టం చేశారు. ఎందుకంటే (తీర్పుదినమున) అల్లాహ్ అతనిపై తన అనుగ్రహం, దయ, కనికరం చూపడు. మరియు అది ఘోరమైన పాపాలలో (కబాయిర్’లలో) ఒకటి అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తి చూపారు.