అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత. ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన సహోదర ముస్లింకు ఎలాంటి ఆయుధాన్నీ (కత్తి, తుపాకీ, మొదలైనవి) చూపించకూడదని, ఉద్దేశపూర్వకంగానైనా లేదా సరదాగానైనా సరే అలా చేయవద్దని హెచ్చరించారు. ఎందుకంటే, షైతాను అతడిని (తొందరపాటులో, కోపంలో) ఆ ఆయుధాన్ని ఉపయోగించేలా ప్రేరేపించవచ్చు; దాంతో అతను తన సహోదరుడిని గాయపరచ వచ్చు లేదా చంపవచ్చు. అలా జరిగితే, అతను పెద్ద పాపంలో పడిపోతాడు, దాని ఫలితంగా నరకంలో పడే ప్రమాదమూ ఉంది.

explain-icon

fawaed

  • ముస్లిం రక్తం యొక్క పవిత్రతపై వివరణ
  • ఒక ముస్లిమ్‌ తోటి ముస్లింను గౌరవించడం తప్పనిసరి మరియుఅతడు తన చేష్టల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ ఏ విధంగానైనా సరే ఇతరులకు హాని కలిగించకూడదని నిశ్చయంగా ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలాంటి హానికరమైన కార్యాల్లో ఒకటి — ఏదైనా ఇనుప వస్తువును లేదా ఆయుధాన్ని తన ముస్లిం సోదరుని వైపు చూపించడం, సరదాగా అయినా, పరిహాసానికి అయినా అలా చేయకూడదు. ఎందుకంటే: షైతాను అతని చేతిని ప్రేరేపించి, ఆ సోదరునిపై దాడి చేయాలనే ఆలోచనను అతనిలో కలిగించ వచ్చు. లేదా షైతాన్ అతని చేతిలోని ఆయుధాన్ని అలనాలోచితంగా విసిరి వేయించి, అది అతడి సోదరుడికి తగిలేలా చేసి, అతడికి హాని జరిగేలా చేయవచ్చు.
  • నిషేధించబడినదానికి దారి తీసే పనులను నిషేధించడం ద్వారా వాటి మార్గాలను పూర్తిగా అడ్డుకోవడం.
  • సమాజ భద్రత మరియు ప్రజల మధ్య సంబంధాలను కాపాడుకోవడంపై శ్రద్ధ వహించాలి. సూచించడం లేదా బెదిరించడం ద్వారా కూడా ఎవరినీ భయభ్రాంతులను చేయకూడదు.