ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా స్పష్టపరుస్తున్నారు: ఎవరైతే జిహాద్‌లో అల్లాహ్ కోసం నిజాయితీగా, కేవలం పుణ్యఫలాన్ని, ప్రతిఫలాన్ని ఆశిస్తూ, ఒక రోజు ఉపవాసం ఉంటారో - ఈ విషయంలో “జిహాద్‌లో లేదా ఇతరత్రా ఉపవాసం ఉంటారో” అని కూడా అనబడింది - అప్పుడు అల్లాహ్ తన దయతో, అనుగ్రహంతో డెబ్బై సంవత్సరాల పాటు అతడిని నరకాగ్ని నుండి దూరం చేస్తాడు.