అల్-బరా' ఇబ్న్ 'అజీబ్' రదియల్లాహు అన్హు, భుజాల వరకు పొడవాటి జుట్టు కలిగి, నల్లటి ఇజార్ మరియు ఎర్రటి చారలు ఉన్న పైన కప్పుకొను వస్త్రము ధరించిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అందంగా ఉన్న వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శారీరక లక్షణాలలో విశాలమైన భుజాలు, విశాలమైన ఛాతీ, మరీ పొడవైన వ్యక్తి, లేదా మరీ పొట్టి వ్యక్తి కాకుండా సగటు ఎత్తు కలిగి ఉండేవారు.