ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్ గుస్ల్ స్నానము’ ఒక ‘సా’ నీళ్ళతో పూర్తి చేసేవారు, అలాగే ఉదూను ఒక ‘ముద్’ నీళ్ళతో పూర్తి చేసేవారు. ఒక ‘సా’ నాలుగు ‘ముద్’ లకు సమానం. ఒక ‘ముద్’ అంటే ఓ మోస్తరు ఎదిగిన వ్యక్తి యొక్క ఒక దోసిలి నిండా పట్టేటంత పరిమాణానికి సమానము.